ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గాంధీ

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ముఖ్యమంత్రి సహాయనిధికి సంబంధించి ప్రస్తుతం ఆసుపత్రుల్లో అవుతున్న బిల్లులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచాలని కోరారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ . ఈ సందర్భంగా నేడు తన క్యాంపు కార్యాలయంలో 67 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రిలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సాయంని అందిస్తుందని దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో వందలాది కుటుంబాలను తమ ఆదుకున్నామని తెలిపారు. గతంలో ఉన్న బిల్లులకు అనుగుణంగానే ప్రస్తుతం ఆర్థిక సాయం అందిస్తుందని దానిని మరింత పెంచేలా కృషి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి త్వరలోనే కలిసి వినతి పత్రాన్ని అందజేస్తానని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *