సిరాన్యూస్, కళ్యాణదుర్గం
5 రూపాయలకే నాణ్యమైన భోజనం : ఎమ్మెల్యే సురేంద్ర బాబు
* కళ్యాణదుర్గంలో అన్న క్యాంటిన్ ప్రారంభం
సామాన్య ప్రజల కడుపు నింపేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగ నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ను కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు , అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. భోజనం చేసే వారి కోసం ఫిల్టర్ వాటర్ ను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తన స్వంత నిధులు వెచ్చించి తాగునీటి ప్లాంటును ఏర్పాటు చేసి ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అమిలినేని పార్టీ నాయకులతో కలసి అన్న క్యాంటీన్ లో భోజనం వడ్డించి, అక్కడే భోజనం చేశారు.