సిరాన్యూస్, ఓదెల
సహకార సంఘాల అభివృద్ధికి పెద్దపీట : ఎమ్మెల్యే విజయ రమణారావు
* ఓదెలలో నూతన గోదాం ప్రారంభం
సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.శనివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొంత నిధులు రూ. కోటి 50 లక్షల 53 వేల తో నిర్మించిన గోదాంను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 33 మందికి కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ఓదెల మండలంలో మేజర్ గ్రామపంచాయతీలైన కనపర్తి ఓదెల కోలనూరు రైతులకు అందుబాటులో ఉండేటట్లు సహకార సంఘం ఆధ్వర్యంలో 100 రోజులలో గోదాములు నిర్మిస్తామని అన్నారు. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ ప్రజాహిత నాయకుడు విజయ రమణారావు అని కొనియాడినారు. 20 సంవత్సరాల నుండి సహకార సంఘాలు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. సహకార సంఘం డబ్బులతో నిర్మాణాలు చేపడుతున్నామని, సంఘ సభ్యులకు మంచి చేయాలనే ఉద్దేశంతో 26 సేవలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి తిరుపతి, తాసిల్దార్ యాకన్న, సింగల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, ఓదెల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, పోత్కపల్లిసహకార సంఘం ముఖ్య కార్యనిర్వాహణ అధికారి అంజిరెడ్డి, పాలకవర్గం మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ ఎంపిటిసి బోడకుంట లక్ష్మి చిన్నస్వామి, చీకట్ల మొండయ్యా, ఓదెల గౌడ సంఘం మాజీ అధ్యక్షులు పచ్చిమట్ల శ్రీనివాస్, బండారి కుమారస్వామి, గడిగొప్పుల సంతోష్, ఇందుర్తి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపతి సదానందం, అంకం రమేష్, అంబాల కొమరయ్య, బైరీ రవి, పిట్టల రవికుమార్, మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.