సిరాన్యూస్, ఓదెల
అఖిర యూపీవీసీ డోర్స్ విండోస్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరామరావు
పెద్దపల్లి జిల్లా జిల్లా కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు యూపీవీసీ ద్వారా డోర్స్ విండోస్ తయారు చేయు షాపును ప్రారంభించారు. మార్కెట్ రంగంలో కర్రతో తయారు చేసే వస్తువులు ధరలు పెరగడంతో వినియోగదారుడు రెడీమేడ్ వస్తువులకు అలవాటు పడి కర్రతో సమానమైన నాణ్యమైన యూపీవీసీ ద్వారా డోర్లు కిటికీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అనంతరం ఎమ్మెల్యే విజయ రమణ రావు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల వారీ కి యూపీ వీసీ తో తయారు చేయబడిన డోర్స్ విండోస్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, షాపు నిర్వాహకులు రాకేష్ , నరేష్, మిత్రులు అనిల్ కుమార్, శ్రీహరి, సంతోష్, తదితరులు ఉన్నారు.