సిరాన్యూస్, ఓదెల
రైల్వే అభివృద్ధికి కృషి చేస్తా: ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
కొలనూరు రైల్వే అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు రైల్వే స్టేషన్ లో రైలు ఆల్టింగ్ చేయించాలని , ఆజ్ని ఎక్స్ప్రెస్, కాగజ్‌నగర్ ఎక్స్ప్రెస్, కరీంనగర్ తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లు ,కొలనూరు రైల్వే గేటు వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ శాలువాతో సన్మానించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావుతో కలిసి ఓదెల మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రైల్వే అభివృద్ధిపై పార్లమెంట్లో చర్చిస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లం సతీష్ ,సామ రాజేందర్,పలకల సాగర్ ,అల్గువెల్లి రవీందర్,జంగం కొంరయ్య,గాజుల శివశంకర్ ,ఆసరా పెద్దఎర్రయ్య,కోమర్ల మధుసూదన్,జంగ రాయమల్లు, బోయిని షేరాలు, తిరుపతి రెడ్డి, బైరి స్వామి, దొడ్డే స్వామి ,రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.