సిరా న్యూస్,మెదక్;
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం సంగారెడ్డి,మెదక్ జిల్లాల్లో నమోదు అయింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ లో 9.6 సెంటిమీటర్ల భారీ వర్షం కురిసింది. మెదక్ జిల్లా కొల్చారంలో 9.4 సెంటిమీటర్ల భారీ వర్షపాతం నమోదు అయింది. సిర్గాపూర్ మండలం వగ్దల్, గైరాన్తండా మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. గైరాన్తండా జల దిగ్బంధంలో చిక్కుకుంది.