MP Mallu Ravi: ఆదిలాబాద్ లో ఎంపీ మ‌ల్లు ర‌వికి ఘ‌న స్వాగ‌తం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఆదిలాబాద్ లో ఎంపీ మ‌ల్లు ర‌వికి ఘ‌న స్వాగ‌తం

త్వ‌ర‌లో మ‌హారాష్ట్ర‌లో ఎన్నిక‌లు జ‌రిగే నేప‌ధ్యంలో యావ‌త్ మాల్ జిల్లా కాంగ్రెస్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు ,నాగ‌ర్ క‌ర్నూల్ ఎంపీ డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి ఆదిలాబాద్ ను సంద‌ర్శించారు. కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యానికి విచ్చేసిన ఆయ‌న‌కు స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. పూల బొకేలు అందించి శాలువాల‌తో స‌త్క‌రించారు. మ‌హారాష్ట్ర‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. యావ‌త్ మాల్ వాషిం పార్ల మెంట్ స్థానంతో పాటు సెగ్మెంట్ లోని ఆరుకు ఆరు సీట్లు తామే గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. జ‌మ్ము కాశ్మీర్ , హ‌ర్యానా ఎన్నిక‌ల్లోను హ‌స్తం పార్టీ స‌త్తా చాటుతుంద‌ని కేంద్రంలోని బీజేపి ప్ర‌భుత్వం కుప్ప‌కూలడం ఖాయమ‌న్నారు. రాహుల్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రి కావ‌డం త‌ధ్య‌మ‌న్నారు.ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్,ఎం.ఏ షకీల్, గోక గణేష్ రెడ్డి,జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, ఐఎన్టియూసి జిల్లా అధ్యక్షులు మునిగేల నర్సింగ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, వైస్ ప్రెసిడెంట్ సోనియా మంథని,మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే,కౌన్సిలర్లు బండారి సతీష్,రామ్ కుమార్, నాయకులు పోరెడ్డి కిషన్,అల్లూరి భూమ రెడ్డి,యెల్టీ భోజా రెడ్డి,సుధాకర్ గౌడ్,బూర్ల శంకరయ్య,దాసరి ఆశన్న,రాజేశ్వర్,బాసా సంతోష్,ఎం.ఏ కయ్యుమ్,మహమూద్,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *