సిరా న్యూస్,మొగల్తూరు;
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామపంచాయతీ పరిధి నక్కవారి పాలెం లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. నక్కవారిపాలెం గొల్లగూడెం పాలెం, ఇంజేటి వారి పాలెం, పడమటిపాలెం గ్రామాలకు వెళ్లే ప్రధాన కూడలిలో క్షుద్ర పూజలు చేయడంతో ఉదయమే స్కూల్ కి వెళ్లే చిన్నారులు, మార్కెట్ వెళ్లే ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. మొగల్తూరు నేషనల్ హైవే పై గతంలోనూ క్షుద్ర పూజలు చేసిన దుండుగులు కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ పూజలు చేయడంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.