సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ పాలకవర్గం, ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1,51,01,116 విరాళం అందజేసారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేసారు. ఈ కార్యక్రమానికి బ్యాంక్ చైర్మన్ ఎం.రవీందర్ రావు, వైస్ చైర్మన్ కె.సత్తయ్య, డైరెక్టర్లు తదితరులు హజరయ్యారు.