సిరా న్యూస్,విజయవాడ;
వాహనం నడుపుతూ ఫోన్లు మాట్లాడుతున్న వారిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మహాత్మాగాంధీ రోడ్డులో ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకున్నారు. పలువురికి కౌన్సెలింగ్ ఇచ్చి మరికొందరికి జరిమానా విధించారు. ఫోన్ మాట్లాడుతూ డ్రై చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.