సిరా న్యూస్,అమరావతి;
సాధారణ ఎన్నికల కోసం పాఠశాలలను సిద్ధం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ జరిగే స్కూల్స్ లో వసతులు కల్పించాలని ఆదేశించి, స్కూల్ మెయింటెనెన్సు ఫండ్(SMF) తో పోలింగ్ రోజు అవసరమైన వసతులు కల్పించాలని సూచించింది. జనవరి 31 లోగా పాఠశాలలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.