సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రం లోని కస్తూరి భా ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలలో కలకలం రేగింది. 11మంది విద్యార్థినులకు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో అస్వస్థతకు గురయ్యారు. వారిని జహీరాబాద్ పట్టణం లోని ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. నిలకడగా ఎనిమిదిమంది విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి వుంది. హాస్టల్ భవనం పాతది కావడం, గోడలన్నీ పూర్తిగా తేమగా మారడంతో విద్యార్దినుల జ్వరాల బారిన పడినట్లు అనుమానిస్తున్నారు. పలువురు విద్యార్థినులకు శ్వాసకోశ సమస్యలు తలెత్తింది