సిరా న్యూస్,హయత్ నగర్;
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మొబైల్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు, మొబైల్ షాప్ లోని సుమారు లక్షనార విలువ చేసే సెల్ ఫోన్లు, నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.