సిరా న్యూస్,బాపట్ల;
బాపట్ల మండలం జమ్ములపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రారంభించి మొదటి శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బొంతు శివసాంబి రెడ్డి, బాపట్ల పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, గ్రామ పార్టీ అధ్యక్షులుకరణం యజ్ఞేశ్వరరావు మరియు నియోజకవర్గ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు