– మేకల మారుతి యాదవ్
కమాన్ పూర్;
తెలంగాణలో యాదవుల అతి ముఖ్యమైన జీవనాధారం అయినా పాడి పరిశ్రమ, ఆ జీవాలతో యాదవుల జీవితంలో విడదీయరాని అనుబంధం ఉంటుంది దానికి గుర్తుగా దీపావళి పండుగ తర్వాత రెండో రోజు జరుపుకొనే పాడి పరిశ్రమకు సంబంధించిన జీవాలను అలంకరించి వాటిని పూజించే సంప్రదాయం స్వాతంత్రం రాకముందు నిజాం కాలం నుంచి కొనసాగుతుంది.అట్టహాసంగా జరుపుకునే యాదవుల సదర్ సమ్మేళనాన్ని పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శనివారం నవంబర్ 02న రోజున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సదర్ సమ్మేళనాన్ని ప్రతి ఏడాది రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను శాంతి కుమారి ఆదేశించారు. ఇట్టి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు గారికి యాదవ సమాజం పక్షాన మేకల మారుతి యాదవ్ శనర్థులు తెలియజేశారు. యాదవులందరూ ఐక్యతతో ఉండి సదర్ సమ్మేళనాన్ని ప్రతి గ్రామ గ్రామాన పండగల నిర్వహించాలని కోరారు.