సిరా న్యూస్,జమ్మికుంట;
జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం సోమవారం ఉదయం ప్రారంభించారు.. జమ్మికుంట లోని పాత వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్, ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు తీసుకువచ్చే వడ్లని ఆరబెట్టుకుని తీసుకురావాలని తేమశాతం 17% లోపు ఉన్నట్లయితేనే కొనుగోలు చేయడం జరుగుతుందని గ్రేడ్ ఏ రకం క్వింటాల్ 2320 రూపాయలు, సాధారణ రకం 2300 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని తెలిపారు.. రైతులు పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ లు, అందించాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ మామిడి తిరుపతిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ సెక్రెటరీ మల్లేశం, సీఈవో రవీందర్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్లు రాజయ్య, తిరుపతి, శ్రీలత, బక్కయ్య, తిరుపతిరావు రాధిక లింగారావు, రాజశేఖర్, కుమార్, సమ్మయ్య, రమాదేవి,లతోపాటు జమ్మికుంట ఆర్థిదారుల సంఘం అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, మరియు రైతులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు…