సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి :
కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేటలో పని చేసిన దళిత ఎస్ఐ శ్రీరాముల శ్రీను బలవన్మరణానికి కారకులను కఠినంగా శిక్షించాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని న్యాయ పోరాట సంఘీభావ కమిటీ ప్రతినిధులు గురిమిల్ల రాజు, జిలుక శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం మాట్లాడుతూ ఎస్ఐ శ్రీనును పైఅధికారి కులం పేరుతో వేధించాడని ఆరోపించారు. అధికారి వేధింపులు పడలేక శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశానని ఇచ్చిన మరణ వాంగ్మూలం ప్రకారం సదరు అధికారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. నిందితులకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేసి వెంటనే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, మృతుడి భార్యకు గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పోరిక ఉదయ్ సింగ్, చక్రవర్తి, ఆరేపల్లి క్రాంతి కిరణ్, మొగిలి, ఎర్ర మోహన్ కృష్ణ, బాధిత కుటుంబ సభ్యురాలు శంకరమ్మ, తదితరులు పాల్గొన్నారు.