సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా కాజులూరు మండలం శలపాక గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మృతి చెందారు. ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు పై మరొక కుటుంబం గురువారం రాత్రి విచక్షణరహితంగా కత్తులు తో దాడి చేసారు. పక్క పక్క నే ఉంటున్న రెండు కుటుంబాల మధ్య విభేదాలు వున్నాయి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతులు రమేష్, చిన్ని, రాజు.